ముమ్మిడివరం ఆగస్ట్ 12( జియస్ బి వార్త)
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రతినెల రెండవ బుధవారం జరిగే మండల పార్టీ సమావేశం ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మండల పార్టీ అధ్యక్షుడు అర్ధాని శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథిగా డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుర్తుల సాయి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాల పూర్తయిన సందర్భంగా డోర్ టు డోర్ కార్యక్రమం సక్సెస్ఫుల్గా పూర్తి చేయాలని ఎన్నికలలో వాగ్దానం చేసినట్టుగా సూపర్ సిక్స్ పథకాలు ఒక్కొక్కటి పేదలకు అందిలాగా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారని డీఎస్సీ లో ఎక్కడ తప్పు జరగలేదని కానీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తుందని ఇటువంటివి మనo తిప్పి కొట్టాలని కూటమి ప్రభుత్వం ఇటు అభివృద్ధి అటు సంక్షేమలో ముందుకు దూసుకు వెళ్తుందని రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘనం విజయం సాధిస్తుందని కార్యకర్తలు అందరూ సైనికులుగా పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు
ఈ కార్యక్రమంలో మాజీ ఏ ఎమ్ సి గోలకోటి దొరబాబు, దొమ్మేటి రమణ కుమార్, దంగేటి శ్రీనివాస్, యాళ్ల ఉదయ్, గొల్లపల్లి ధర్మారావు,గోదాసి గణేష్,పెరిచర్ల సురేష్,ఇందుకురి పాండురంగరాజు, కోలా నాని, పాయసం చిన్ని, సబ్బతి డేవిడ్ రాజు, బొక్కా సత్తిబాబు,గీసాల చంద్రరావు,పళ్ళ రాజబాబు, గోలకోటి భాష్కర రామూర్తి తోలేటి రాంబాబు, రేఖాడి రాంబాబు, నక్క సతీష్,యానామదల సుబ్బారావు, పాల్గొన్నారు
డోర్ టు డోర్ కార్యక్రమం త్వరగా పూర్తి చేయాలి — జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి
Date:
