తాళ్లరేవులో అభివృద్ధి జాతర.. రూ.11.75 కోట్ల పనులకు శ్రీకారం! సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పుష్కర ఘాట్లు, తాగునీటి పథకాలకు పెద్దపీట
తాళ్లరేవు, అక్టోబర్ 10 (జీఎస్బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గంలోని తాళ్లరేవు మండలంలో అభివృద్ధి పనులకు ఊపందుకుంది. మండలంలోని పలు గ్రామాల్లో రూ.11.75 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) శనివారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడమే లక్ష్యంగా సీసీ రోడ్లు, రోడ్డు కం డ్రైనేజీలు, పుష్కర రోడ్లు, ఘాట్లు, తాగునీటి పథకాలు, కమ్యూనిటీ హాల్, అంగన్వాడీ కేంద్రం...