vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 31 October 2026, 1:50 pm Posted by : వార్తా జిఎస్‌బి

తుపాను బాధిత గ్రామాల్లో ఢిల్లీ నారాయణ సేవా కార్యక్రమాలు కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాల తొలగింపు.. గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టిన రెడ్‌క్రాస్ బృందం

ఐ. పోలవరం: ఆర్నబ్ తుపాను ప్రభావంతో ఐ. పోలవరం మండలంలోని టి. కొత్తపల్లి, కాట్రేనికోన తదితర గ్రామాల్లో కూలిపోయిన చెట్లు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ కోరుకొండ సత్యనారాయణ (ఢిల్లీ నారాయణ) ప్రత్యేక చొరవ తీసుకుని సహాయక చర్యలు చేపట్టారు.

తుపాను కారణంగా రహదారులపై పడిపోయిన భారీ వృక్షాలను తొలగించడంతో పాటు, విద్యుత్ స్తంభాల మరమ్మతు పనులు చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, విరిగిపడిన చెట్ల కొమ్మలను తొలగించి పరిసరాలను పరిశుభ్రం చేయించారు.

తుపాను కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న గ్రామీణ ప్రజలకు అండగా నిలుస్తూ, ప్రజల రాకపోకలకు అంతరాయం లేకుండా చేయడం, గ్రామాల్లో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూడటమే లక్ష్యంగా ఈ సేవా కార్యక్రమాలను నిర్వహించారు.

ఆపద సమయంలో ప్రజలకు అండగా నిలవడమే నిజమైన సేవ అనే సంకల్పంతో ఢిల్లీ నారాయణ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమాలపై గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

ఈ సేవా కార్యక్రమంలో రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ కోరుకొండ సత్యనారాయణ (ఢిల్లీ నారాయణ), పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.