తుపాను బాధిత గ్రామాల్లో ఢిల్లీ నారాయణ సేవా కార్యక్రమాలు కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాల తొలగింపు.. గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టిన రెడ్‌క్రాస్ బృందం

ఐ. పోలవరం: ఆర్నబ్ తుపాను ప్రభావంతో ఐ. పోలవరం మండలంలోని టి. కొత్తపల్లి, కాట్రేనికోన తదితర గ్రామాల్లో కూలిపోయిన చెట్లు, నేలకొరిగిన విద్యుత్ స్తంభాలతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన రెడ్‌క్రాస్ సొసైటీ చైర్మన్ కోరుకొండ సత్యనారాయణ (ఢిల్లీ నారాయణ) ప్రత్యేక చొరవ తీసుకుని సహాయక చర్యలు చేపట్టారు. తుపాను కారణంగా రహదారులపై పడిపోయిన భారీ వృక్షాలను తొలగించడంతో పాటు, విద్యుత్ స్తంభాల మరమ్మతు పనులు చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం, విరిగిపడిన చెట్ల కొమ్మలను తొలగించి పరిసరాలను...