తుఫాను బాధితులను తక్షణమే ఆదుకోవాలి! పంట నష్టాలపై సమగ్ర సర్వే చేసి రైతులకు పరిహారం అందించాలి ఐదు రోజులుగా విద్యుత్ లేక ప్రజల అవస్థలు.. వెంటనే సరఫరా పునరుద్ధరించాలి వైఎస్సార్సీపీ కార్యదర్శి, మండపేట నియోజకవర్గ పరిశీలకుడు వంటెద్దు వెంకన్నాయుడు డిమాండ్
కోనసీమ: అమలాపురం అక్టోబర్ 31 ( జీఎస్. బి వార్త)అర్నాబ్ తుఫాను సృష్టించిన బీభత్సంతో తీవ్రంగా నష్టపోయిన రైతులు, సామాన్య ప్రజలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి, మండపేట నియోజకవర్గ పరిశీలకుడు వంటెద్దు వెంకన్నాయుడు డిమాండ్ చేశారు. తుఫాను కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకు, బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. తుఫాను ప్రభావంతో వరి, కొబ్బరి, అరటి తదితర పంటలతో పాటు వివిధ ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, రైతులు చేతికొచ్చిన...