తేట తేనెల మూట.. మన తెలుగు మాట తెలుగు భాష పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: గోకవరపు వెంకటరాజు

ఐ. పోలవరం, ఆగస్టు 29 (జియస్ బి వార్త రిపోర్టర్ వేణు): తెలుగు భాష తేట తేనెల మూటలాంటి మధురమైన భాష అని, మాతృభాషను పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని మురమళ్ల శాంతినికేతన్ హైస్కూల్ అధినేత, విద్యావేత్త గోకవరపు వెంకటరాజు (పెదబాబు) అన్నారు. మురమళ్ల శాంతినికేతన్ పాఠశాలలో శనివారం తెలుగు మాతృభాషా దినోత్సవం, గిడుగు వెంకట రామమూర్తి పంతులు జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేధావుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలుగు భాష విశిష్టత, ప్రాముఖ్యతపై ప్రసంగాలు నిర్వహించారు. ఈ సందర్భంగా...