దివంగత మహానేత వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

    Date:

    📰 Generate e-Paper Clip

    వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఐ. పోలవరం నాయకులు

    ఐ. పోలవరం, సెప్టెంబర్ 02 (జియస్‌బి వార్త రిపోర్టర్ వేణు కాశి): దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి (వైఎస్సార్) 17వ వర్ధంతి సందర్భంగా ఐ. పోలవరం గ్రామంలోని హైస్కూల్ సెంటర్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

    ఈ సందర్భంగా వైఎస్సార్ ప్రజలకు అందించిన సేవలను, పేద ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషిని నాయకులు స్మరించుకున్నారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానేత వైఎస్సార్ ఆశయాలను కొనసాగించాలని వారు పేర్కొన్నారు.

    ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దంగుడు బియ్యం వెంకట రామయ్య, గ్రామ కమిటీ కన్వీనర్ కొర్లపాటి ప్రసాద్, సానాబోయిన నాగేశ్వరరావు, పులపకూర కొండా, జంప సత్యనారాయణతో పాటు పలువురు నాయకులు, వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలు పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

    వైఎస్సార్ చేసిన సేవలు, ఆయన ఆశయాలు ఎప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచిపోతాయని ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు.

     

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!