దివంగత మహానేత వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు పసువుల్లంక వైఎస్సార్ వారధి వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు నివాళులు తెలిపిన నాయకులు

ఐ. పోలవరం, సెప్టెంబర్ 02 (జియస్‌బి వార్త రిపోర్టర్ వేణు కాశి): దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి (వైఎస్సార్) 17వ వర్ధంతి సందర్భంగా ఐ. పోలవరం మండలంలోని పసువుల్లంక వైఎస్సార్ వారధి వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ ప్రజలకు అందించిన సేవలను, పేదల సంక్షేమం కోసం ఆయన చేసిన కృషిని నాయకులు స్మరించుకున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో, ప్రజల హృదయాల్లో వైఎస్సార్‌కు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. ఈ...