vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 5:32 pm Posted by : వార్తా జిఎస్‌బి

ద్రాక్షారామం మార్కెట్ పునర్నిర్మాణo పూర్తి – వ్యాపారులకు అందజేత రామచంద్రపురం నియోజకవర్గాన్ని వర్తక, వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేస్తా – మంత్రి సుభాష్*

 

*ద్రాక్షారామం మార్కెట్ పునర్నిర్మాణo పూర్తి – వ్యాపారులకు అందజేత

రామచంద్రపురం నియోజకవర్గాన్ని వర్తక, వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేస్తా – మంత్రి సుభాష్*

 

*ద్రాక్షారామం:*(జిఎస్ బి వార్త)
కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలవడం.. వారి కన్నీళ్లు తుడవడం.. తిరిగి వారి జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరోసారి నిరూపించారు. ఇటీవల ద్రాక్షారామం మార్కెట్‌లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 48 షాపులు అగ్నికి ఆహుతైన ఘటనలో తీవ్రంగా నష్టపోయిన వ్యాపారులకు అండగా నిలిచి, కేవలం ఒకటిన్నర నెలలోనే నూతన షాపులను నిర్మించి అందించడం ద్వారా మంత్రి సుభాష్ ప్రత్యేకత చాటుకున్నారు.ద్రాక్షారామ మార్కెట్‌లో అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలుసుకున్న వెంటనే మంత్రి సుభాష్ అర్ధరాత్రి సమయంలోనే సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత వ్యాపారులను పరామర్శించారు. ప్రమాద తీవ్రతను స్వయంగా పరిశీలించి, వ్యాపారుల జీవనోపాధి దెబ్బతినకుండా తక్షణ చర్యలకు శ్రీకారం చుట్టారు.మార్కెట్‌ను యుద్ధప్రాతిపదికన పునర్నిర్మించేందుకు తనవంతుగా రూ.20 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించడంతో పాటు, దాతలను ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మంత్రి సుభాష్ ఇచ్చిన పిలుపుకు స్పందించిన పలువురు దాతలు, ప్రజలు, వ్యాపారులు పెద్ద మనసుతో ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు.

45 రోజుల్లోనే కొత్త మార్కెట్‌కు రూపకల్పన*

మంత్రి సుభాష్ చొరవ, దాతల సహకారం, అధికారుల సమన్వయం, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ కృషితో కేవలం ఒకటిన్నర నెలలోనే 48 షాపుల పునర్నిర్మాణ పనులు పూర్తి చేశారు.ఆదివారం నూతన షాపులను వ్యాపారులకు అందజేయడంతో బాధిత కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. కష్టకాలంలో తమకు అండగా నిలిచి, తిరిగి తమ జీవనోపాధిని నిలబెట్టిన మంత్రి సుభాష్‌కు వ్యాపారులు కృతజ్ఞతలు తెలిపారు.

*ద్రాక్షారామం.. ఇక మోడల్ మార్కెట్*ఈ సందర్భంగా నిర్వహించిన పునర్నిర్మాణ ప్రారంభోత్సవ సమావేశంలో మంత్రి సుభాష్ మాట్లాడుతూ.. ప్రజల సుఖసంతోషాలే నా ప్రథమ కర్తవ్యం. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు అండగా నిలవాలి. ద్రాక్షారామ మార్కెట్‌ను మరింత ఆధునికంగా, సౌకర్యవంతంగా తీర్చిదిద్ది మోడల్ మార్కెట్‌గా అభివృద్ధి చేస్తాం అని తెలిపారు.రామచంద్రపురం నియోజకవర్గాన్ని కేవలం రాజకీయ నియోజకవర్గంగా కాకుండా వర్తక, వాణిజ్య, పారిశ్రామిక కార్యకలాపాలకు కేంద్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు.ద్రాక్షారామం చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో పాటు వ్యాపారపరంగా కూడా మరింత అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మార్కెట్ అభివృద్ధితో స్థానిక వ్యాపారులకు, చిన్న వ్యాపారులకు, చిరు వ్యాపారులకు మరిన్ని అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామన్నారు.మన ద్రాక్షారామం–మన బాధ్యతకు దాతల చేయూత*తన పిలుపునకు స్పందించి “మన ద్రాక్షారామం–మన బాధ్యత” కార్యక్రమానికి చేయూతనిచ్చిన ప్రతి ఒక్క దాతకు మంత్రి సుభాష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.కష్టాల్లో ఉన్న తోటి మనిషికి చేయూత అందించడం మనందరి సామాజిక బాధ్యత అని, ద్రాక్షారామ మార్కెట్ పునర్నిర్మాణంలో దాతలు చూపించిన ఔదార్యం సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ.. అగ్నిప్రమాదంలో షాపులు కోల్పోయిన వ్యాపారులకు తక్కువ సమయంలోనే నూతన షాపులు నిర్మించి అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కుల మత వర్గ బేధాలు చూడకుండా షాపులు కోల్పోయిన అందరికీ కేటాయించమన్నారు. ప్రభుత్వం కూడా నిధులు మంజూరు చేసి సహకరించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.మంత్రి సుభాష్ తనపై ఉంచిన బాధ్యతను స్వీకరించి, సంబంధిత అధికారులు, దాతలు, సిబ్బంది సహకారంతో పునర్నిర్మాణ పనులను విజయవంతంగా పూర్తి చేశామని తెలిపారు.నియోజకవర్గంలో ఎవరికి కష్టం వచ్చినా.. వారి కుటుంబానికి మేము అండగా ఉంటాం. ప్రజల సమస్యలను మా సమస్యలుగా భావించి పరిష్కారానికి కృషి చేస్తాం అని సత్యం భరోసా ఇచ్చారు.మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు- ఆర్డీవో*ఆర్డీవో సరళావతి మాట్లాడుతూ.. కష్టకాలంలో ఉన్న వ్యాపారులు, ప్రజల పట్ల మానవతా దృక్పథంతో స్పందించి వారి జీవనోపాధిని తిరిగి నిలబెట్టేందుకు కృషి చేసిన మంత్రి సుభాష్‌కు, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సాటి వారికి సహాయం చేయడమే మానవతా ధర్మంగా భావించి ముందుకు వచ్చిన దాతలను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.*ఒక్క మానవతా పిలుపు.. దాతల సహకారం* మన ద్రాక్షారామం–మన బాధ్యత పిలుపు ఒక కార్యక్రమంగా ప్రారంభమై.. ప్రజల భాగస్వామ్యంతో ఒక సామూహిక ఉద్యమంగా మారిందని నాయకులు పేర్కొన్నారు.ఒక అగ్నిప్రమాదం 48 కుటుంబాల జీవనోపాధిని దెబ్బతీస్తే.. అదే సమయంలో మానవత్వం, దాతృత్వం, ప్రజాప్రతినిధుల చొరవ కలసి ఆ కుటుంబాలకు కొత్త ఆశను అందించాయి. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ శిలాఫలకాన్ని ఆవిష్కరించి, పునర్నిర్మించిన షాపులను ప్రారంభించారు. సహకారం అందించిన దాతలను ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం, ఆర్డీవో సరళావతి, ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, జనసేన ఇన్‌చార్జి పోలిశెట్టి చంద్రశేఖర్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షులు గుత్తుల సాయి, చిక్కాల దొరబాబు, కర్రి చిట్టిబాబు, మాగాపు అమ్మిరాజు, ద్రాక్షారామం మాజీ సర్పంచ్ కొత్తపల్లి అరుణ, టీడీపీ రూరల్ మండల అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనుబాబు, కూటమి పార్టీ ముఖ్య నాయకులు, స్థానిక నాయకులు, అధికారులు, వ్యాపారులు, దాతలు తదితరులు పాల్గొన్నారు.