నిరుద్యోగ యువతకు మహాబోధి భరోసా.. ప్రభుత్వ ఉద్యోగాలే లక్ష్యంగా ఉచిత ఆన్‌లైన్ శిక్షణ! ఈ నెల 20 నుంచి ఉచిత ఆన్‌లైన్ శిక్షణ తరగతులు ప్రారంభం మాజీ ఐఆర్‌ఎస్ అధికారి రేవు బాలయోగి అధ్యక్షతన నిరుద్యోగ యువతకు అవగాహన సదస్సు

ఐ.పోలవరం, అక్టోబర్ 11 (జీఎస్‌బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి): గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ప్రభుత్వ ఉద్యోగాల సాధనలో అండగా నిలిచి, వారి భవిష్యత్తుకు బాటలు వేయాలనే సంకల్పంతో మహాబోధి ఎడ్యుకేషనల్ సొసైటీ ముందడుగు వేసింది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు సరైన మార్గదర్శకత్వం, అధ్యయన సామగ్రి అందించడంతో పాటు ఉచిత ఆన్‌లైన్ శిక్షణ అందించేందుకు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆదివారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం స్వర్ణ పశువులంక పరిధిలోని గోడి వారి...