నిరుపేద కుటుంబాల గుర్తింపుపై మహిళా సమాఖ్య సభ్యులకు శిక్షణ జీరో పావర్టీ మిషన్ లక్ష్యాల సాధనకు క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే చేయాలి
ముమ్మిడివరం, అక్టోబర్ 9 (జీఎస్బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జీరో పావర్టీ మిషన్లో భాగంగా నిరుపేద కుటుంబాలను గుర్తించి, వారి ఆర్థిక, సామాజిక పరిస్థితులపై సమగ్ర నివేదికలు రూపొందించేందుకు మహిళా సమాఖ్య సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముమ్మిడివరం మండల మహిళా సమాఖ్య కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సంఘాల లీడర్లు, గ్రామ సంస్థ సహాయకులు (వీఓఏలు) పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ సచివాలయాల వారీగా...