నిస్వార్థ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి అసలైన బలం సొంత నిధులతో పార్టీ కార్యాలయం నిర్మించిన సూర్యవర్మ సేవలు అభినందనీయం – ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు

ఐ. పోలవరం ( జియస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి) నిస్వార్థంగా ప్రజలకు  సేవలందించే కార్యకర్తలు ఉండటమే తెలుగుదేశం పార్టీకి అసలైన బలమని ముమ్మిడివరం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) అన్నారు. ఐ. పోలవరం మండలం కొమరిగిరి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త పెన్మెత్స సూర్యవర్మ, పార్టీపై తనకున్న అపారమైన అభిమానాన్ని చాటుతూ తన సొంత 20 సెంట్ల స్థలంలో సుమారు రూ.5 లక్షల వ్యయంతో నూతనంగా పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు. అదే ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు,...