ఐ.పోలవరం సెప్టెంబర్ 07(జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి)ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ఎన్.టి.ఆర్. భరోసా పింఛన్లు మంజూరు చేసేందుకు అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది.
వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళ, వికలాంగులు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, డప్పు కళాకారులు, సాంప్రదాయ చర్మకారులు, కల్లుగీత కార్మికులు, ట్రాన్స్‌జెండర్‌లలో అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుల స్వీకరణ: సెప్టెంబర్ 7 నుంచి 16 వరకు
దరఖాస్తు స్థలం: సంబంధిత గ్రామ సచివాలయం
అర్హులైన వారు నిర్ణీత గడువులో తమ గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి, మండల ప్రజా పరిషత్, ఐ.పోలవరం తెలిపారు.