vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 26 October 2026, 4:39 am Posted by : వార్తా జిఎస్‌బి

నైతిక విలువలతో కూడిన జర్నలిజం కనుమరుగు అవుతుంది  సీనియర్ పాత్రికేయులు మధుసూదన్ రావు  కాకినాడ లో చిన్న పత్రికల రిపోర్టర్స్  సంఘం  అధ్యక్షుడిగా రాయవరపు ప్రభాకర్  ఎన్నిక.

 

నైతిక విలువలతో కూడిన జర్నలిజం కనుమరుగు అవుతుంది

సీనియర్ పాత్రికేయులు టీ మధుసూదన్ రావు

 

కాకినాడ లో చిన్న పత్రికల రిపోర్టర్స్  సంఘం  అధ్యక్షుడిగా రాయవరపు ప్రభాకర్

కాకినాడ(జిఎస్ బి వార్త)

కాకినాడలో ఉన్న స్థానిక దినపత్రికల రిపోర్టర్ల నూతన కార్యవర్గం సీనియర్  జర్నలిస్టులు టి.మధుసూదన్ రావు, బొడ్డు వెంకటరమణ, నక్క చిట్టిబాబు ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేశారు.

ప్రముఖ అడ్వకేట్ లీగల్ కన్సల్టెంట్, ఫ్యామిలీ కౌన్సిలర్ పిఆర్ కృష్ణ రెడ్డి, మెడి కవర్ సెంట్రల్ హెడ్ నందికొళ్ళ అంజిబాబు ముఖ్య అతిధులుగా హాజరైన సమావేశంలో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా మధుసూదన్ రావు మాట్లాడుతూ, నైతిక విలువలతో కూడిన జర్నలిజం కనుమరుగు అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక దినపత్రికల ఎడిటర్లు రిపోర్టర్లు మాత్రమే విలువలతో కూడిన జర్నలిజాన్ని సమాజానికి అందిస్తారని తెలిపారు. కాకినాడలో ఉన్న స్థానిక చిన్న పత్రికలకు ప్రభాకర్ రావు వంటి రిపోర్టర్ అధ్యక్షుడిగా ఉంటే అతని ద్వారా జర్నలిస్టులకు సంబంధించిన మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయని కితాబు ఇచ్చారు. ఈ సందర్భంగా బొడ్డు వెంకటరమణ మాట్లాడుతూ కాకినాడలో గత పది సంవత్సరాల నుండి స్థానిక దినపత్రిక రిపోర్టర్ల సంక్షేమ సంఘం పెట్టి అనేక కార్యక్రమాలు నిర్వహించిన సంఘాన్ని అభినందించారు. నక్కా చిట్టిబాబు మాట్లాడుతూ, సమాజంలో స్థానిక దినపత్రికల ఆవశ్యకత ఎంతైనా ఉందని అలాగే ఈ దినపత్రికల్లో రిపోర్టుల ఉన్న అభివృద్ధి సంక్షేమం కూడా ముఖ్యమని అది ఇటువంటి సంఘాల ద్వారా మాత్రమే సాధించగలమని తెలిపారు. మెడి కవర్ సెంట్రల్ హెడ్ అంజిబాబు మాట్లాడుతూ స్థానిక దినపత్రిక సంఘం ఏర్పాటు చేసుకోవడం చాలా అభినందనీయమని, జర్నలిస్టులకు ఎటువంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉంటే వారికి తమ మెడికెవరు హాస్పిటల్ ద్వారా అండదండగా ఉంటానని హామీ ఇచ్చారు అలాగే అడ్వకేట్ కృష్ణారెడ్డి మాట్లాడుతూ సమాజంలో పత్రికల పాత్ర చాలా కీలకమని స్థానిక దినపత్రిక రిపోర్టర్ల సంక్షేమ సంఘానికి లీగల్ అడ్వైజర్ గా నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు రాయవరపు ప్రభాకర్ రావు మాట్లాడుతూ 2016లో కాకినాడలో చిన్న మధ్యతరగతి దినపత్రికల రిపోర్టర్ల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసి కాకినాడలో ఉన్న జర్నలిస్టుల కోసం అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేసిన సంగతి గుర్తు చేశారు. అలాగే రాబోయే కాలంలో కాకినాడలో ఉన్న స్థానిక దినపత్రిక విలేకరుల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేస్తామని హామీ ఇచ్చారు. నగరంలో ఉన్న జర్నలిస్టులందరినీ కలుపుకుపోవడం తమ ముందున్న ప్రధాన కర్తవ్యం అని, తమ తోటి జర్నలిస్టులకు ఇటువంటి కష్టం వచ్చినా సరే ఈ సంఘం అండగా ఉంటుందని తెలిపారు. త్వరలో స్థానిక జర్నలిస్టులు అందరికీ హెల్మెట్లు ఇచ్చే కార్యక్రమం చేస్తామని అలాగే ఆరోగ్య భీమా కూడా కట్టే విధంగా దాతలు సహాయం తీసుకుంటామని తెలిపారు. సంఘానికి గౌరవ అధ్యక్షులుగా పరశురాము కార్యదర్శిగా పిచ్చుక రఘురాము కోశాధికారిగా అజయ్,, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా బిందన సురేష్, లక్ష్మీనారాయణ ను సహాయ కార్యదర్శిగా ప్రసాద్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా అనిల్,నెంబర్లుగా సత్తిరాజు, ఆకెళ్ళ శ్రీనివాసు, వాసంశెట్టి శ్రీనివాసు, కరుణాకరు, స్వామి,వెంకట్, వార్త సుబ్బారావు , భషీర్ ను నియమించారు. అలాగే ఈ సంఘాన్ని మరింత బలోపేతం చేసే విధంగా త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు . ఈ కార్యక్రమానికి కాకినాడ నగరంలో ఉన్న లోకల్ ఛానల్ ప్రతినిధులు మరియు స్థానిక దినపత్రికల ప్రతినిధులు పాల్గొన్నారు.