vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 30 August 2026, 12:02 pm Posted by : వార్తా జిఎస్‌బి

పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఐ.పోలవరంలో మెగా రక్తదాన శిబిరం రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవండి.

పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఐ.పోలవరంలో మెగా రక్తదాన శిబిరం
రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవండి – నిర్వాహకుల పిలుపు
ఐ.పోలవరం, ఆగస్టు 30 (జియస్‌బి వార్త రిపోర్టర్ వేణు కాశి): జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఐ.పోలవరం మండలంలో భారీ స్థాయిలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఐ.పోలవరం మండలం బాణాపురం సెంటర్‌లో, నివాస్ ఫౌండేషన్, రాయపురెడ్డి సత్య సిద్ధు ఆధ్వర్యంలో, జనసేన పార్టీ ఐ.పోలవరం మండలం సహకారంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని సేవా కార్యక్రమాల ద్వారా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రక్తదానం ద్వారా అవసరంలో ఉన్న వారి ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుందని, ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి ఈ మహత్తర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జనసేన నాయకుడు, పవన్ కళ్యాణ్ వీరాభిమాని, నివాస్ ఫౌండేషన్ అధ్యక్షుడు రాయపురెడ్డి సత్య సిద్ధు మాట్లాడుతూ, జనసేన నాయకులు, జనసైనికులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, వీర మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేసి మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరారు.
“రక్తదానం చేయండి… ప్రాణదాతలుగా నిలవండి… పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని సేవా కార్యక్రమాలతో ఘనంగా జరుపుకుందాం” అంటూ పిలుపునిచ్చారు.