vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 01 November 2026, 1:01 pm Posted by : వార్తా జిఎస్‌బి

పశువులంకలో కూటమి ఎన్నికల ప్రచార జోరు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసిన జడ్పీటీసీ అభ్యర్థి బీర సత్యకుమారి, ఎంపీటీసీ అభ్యర్థి దంగేటి వెంకటేశ్వరి

ఐ. పోలవరం, నవంబర్ 1 (జీఎస్‌బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి): ఐ. పోలవరం మండలం పశువులంక గ్రామంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కూటమి అభ్యర్థులు బీర సత్యకుమారి, దంగేటి వెంకటేశ్వరి గ్రామంలో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు.

గ్రామంలోని ప్రధాన వీధులు, వివిధ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను పలకరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సైకిల్ గుర్తుకు ఓటు వేసి తమను ఆదరించి గెలిపించాలని ఓటర్లను కోరారు. గ్రామ ప్రజల మద్దతుతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, తమకు అవకాశం కల్పించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు.

అభ్యర్థుల వెంట స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రచారాన్ని కొనసాగించారు. ఈ కార్యక్రమంలో సాగిరాజు సూరిబాబు రాజు, ధూళిపూడి రాంబాబు, మోర్త ధర్మారావు, అద్దంకి శ్రీను, బాబ్జి, మరెళ్ల రాజేష్, శంకరం తదితరులు పాల్గొన్నారు.