పశువులంకలో కూటమి ఎన్నికల ప్రచార జోరు ఇంటింటికీ వెళ్లి ఓటర్లను కలిసిన జడ్పీటీసీ అభ్యర్థి బీర సత్యకుమారి, ఎంపీటీసీ అభ్యర్థి దంగేటి వెంకటేశ్వరి
ఐ. పోలవరం, నవంబర్ 1 (జీఎస్బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి): ఐ. పోలవరం మండలం పశువులంక గ్రామంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కూటమి అభ్యర్థులు బీర సత్యకుమారి, దంగేటి వెంకటేశ్వరి గ్రామంలో విస్తృతంగా పర్యటిస్తూ ఓటర్లను కలిసి తమకు మద్దతు ఇవ్వాలని అభ్యర్థించారు. గ్రామంలోని ప్రధాన వీధులు, వివిధ ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలను పలకరిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సైకిల్ గుర్తుకు ఓటు వేసి తమను ఆదరించి గెలిపించాలని ఓటర్లను కోరారు. గ్రామ ప్రజల మద్దతుతో...