పాత ఇంజరం ఎంపీటీసీ బరిలో బీర సుబ్బలక్ష్మి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఘనంగా నామినేషన్ దాఖలు

ఐ. పోలవరం, అక్టోబర్ 22 (జీఎస్‌బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం ఐ. పోలవరం మండలం పాత ఇంజరం ఎంపీటీసీ స్థానానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బీర సుబ్బలక్ష్మి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆమె నామినేషన్ వేయడంతో పాత ఇంజరం గ్రామంలో రాజకీయ సందడి నెలకొంది. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థుల సమక్షంలో నామినేషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కొండేపూడి కృపా...