పాత ఇంజరం సర్పంచ్‌ రేసులో కొండేపూడి దుర్గా రత్నం

ఐ.పోలవరం, అక్టోబర్ 15 (జీఎస్‌బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి): డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండలం పాత ఇంజరం గ్రామ పంచాయతీ సర్పంచ్‌ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వు కావడంతో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో మాజీ సర్పంచ్‌ కొండేపూడి కృపా వర ప్రసాద్‌ భార్య కొండేపూడి దుర్గా రత్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్‌ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు చర్చ సాగుతోంది. గతంలో సర్పంచ్‌గా పనిచేసిన కొండేపూడి కృపా వర...