పారదర్శకంగా రీ-సర్వే ప్రక్రియను పూర్తి చేయాలి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు

ఐ. పోలవరం, ఆగస్టు 29 (జియస్‌బి వార్త రిపోర్టర్ వేణు): కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూముల రీ-సర్వే కార్యక్రమాన్ని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, పూర్తి పారదర్శకతతో అమలు చేయాలని ప్రభుత్వ విప్, ముమ్మిడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు అధికారులను ఆదేశించారు. భూముల రీ-సర్వే కార్యక్రమం అమలులో భాగంగా శనివారం రీ-సర్వే ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అమలాపురం ఆర్డీవో సరళాదేవి హాజరయ్యారు. రెవెన్యూ, దేవాదాయ శాఖల అధికారులు మరియు సిబ్బందితో ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు రీ-సర్వే కార్యక్రమం...