*పిఠాపురంలో ప్రజాస్వామ్య ఖూనీ:* *పవన్ డైరెక్షన్లో అధికారుల బరితెగింపు* *వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి నామినేషన్ అక్రమ తిరస్కరణ* *పగటిపూట ‘ఓకే’ చెప్పి.. అర్ధరాత్రి దొంగ నోటీసులు అంటించిన వైనం* *ఓటమి భయంతోనే ఆడబిడ్డపై కక్షసాధింపుఒడిశెట్టి నారాయణరెడ్డి ధ్వజం* : *అధికారుల అరాచకంపై హైకోర్టుకు వైఎస్సార్సీపీ* పిఠాపురం / యు.కొత్తపల్లి: పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల వ్యవస్థను అధికార కూటమి పూర్తిగా భ్రష్టు పట్టించిందని, వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఒడిశెట్టి గౌరీ రాజేశ్వరి నామినేషన్ను ఏకపక్షంగా తిరస్కరించడం పచ్చి ప్రజాస్వామ్య ఖూనీ అని పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు ఒడిశెట్టి నారాయణరెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కనుసన్నల్లో, జనసేన నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు. *పగటిపూట ‘సరే’.. చీకటిపడ్డాక ‘రద్దు’* ఈ నెల 23న తన భార్య గౌరీ రాజేశ్వరి తరఫున నామినేషన్ దాఖలు చేయగా, 24వ తేదీ ఉదయం 10:05 గంటలకు స్క్రూట్నీ నిర్వహించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి పత్రాలన్నీ సక్రమంగా ఉన్నాయని ధ్రువీకరించి, ‘ఆల్ ది బెస్ట్’ చెప్పి పంపారని నారాయణరెడ్డి వివరించారు. తీరా రాత్రి 7:32 గంటలకు గుర్తుతెలియని వ్యక్తులతో ఫోన్ చేయించి నామినేషన్ రద్దయిందని చెప్పించడం వెనుక పవన్ కల్యాణ్ కుట్రలు ఉన్నాయని ఆరోపించారు. *చట్టాలు తుంగలోకి.. దొంగ నోటీసులు* పంచాయతీరాజ్ చట్టం, కండక్ట్ ఆఫ్ ఎలక్షన్స్-2006 రూల్ 12(3)ను అధికారులు పూర్తిగా తుంగలో తొక్కారని దుయ్యబట్టారు. నామినేషన్లో ఏవైనా లోపాలుంటే స్క్రూట్నీ సమయంలో వివరణ కోరాలన్న ప్రాథమిక నిబంధనను కూడా గాలికొదిలేశారని విమర్శించారు. స్క్రూట్నీ ముగిసిన 12 గంటల తర్వాత నామినేషన్ తిరస్కరించడం స్వతంత్ర భారత ఎన్నికల చరిత్రలోనే చీకటి అధ్యాయమన్నారు. కలెక్టర్కు అప్పీల్ చేసేందుకు తాము వెళ్లిన సమయంలో, ఇంట్లో ఎవరూ లేనివేళ గుట్టుచప్పుడు కాకుండా తలుపులకు నోటీసులు అతికించి పారిపోవడం అధికారుల దిగజారుడుతనానికి పరాకాష్ట అని ధ్వజమెత్తారు. ఓటమి భయంతోనే పవన్ పగ నియోజకవర్గంలో అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న పవన్ కల్యాణ్, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక బీసీ ఆడబిడ్డను చూసి ఎందుకు వణికిపోతున్నారని నిలదీశారు. ముఖాముఖి తలపడే దమ్ములేకనే అధికారులను గుప్పిట్లో పెట్టుకుని ఇలాంటి కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. గౌరీ రాజేశ్వరికి ప్రజల్లో ఉన్న తిరుగులేని ఆదరణను చూసి ఓర్వలేకే ఈ అక్రమాలకు ఒడిగట్టారని దుయ్యబట్టారు. *హైకోర్టులోనే తేల్చుకుంటాం*
కాకినాడ జిల్లా అక్టోబర్ 26 జి ఎస్ బి వార్త పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల వ్యవస్థను అధికార కూటమి పూర్తిగా భ్రష్టు పట్టించిందని, వైఎస్సార్సీపీ జడ్పీటీసీ అభ్యర్థి ఒడిశెట్టి గౌరీ రాజేశ్వరి నామినేషన్ను ఏకపక్షంగా తిరస్కరించడం పచ్చి ప్రజాస్వామ్య ఖూనీ అని పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక మండలి సభ్యులు ఒడిశెట్టి నారాయణరెడ్డి తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కనుసన్నల్లో, జనసేన నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు అత్యంత దుర్మార్గంగా వ్యవహరించారని మండిపడ్డారు.*పగటిపూట ‘సరే’.. చీకటిపడ్డాక ‘రద్దు’*ఈ నెల 23న తన...