పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై దాడిని ఖండించిన కాశి రామకృష్ణ ప్రజాస్వామ్యంపై దాడి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి
ఐ.పోలవరం, అక్టోబర్ 16 (జీఎస్‌బీ వార్త, రిపోర్టర్ వేణు కాశి): తిరుపతి జిల్లా పుంగనూరులో రాజంపేట ఎంపీ, వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కాన్వాయ్‌పై జరిగిన దాడిని వైఎస్సార్‌సీపీ డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధికార ప్రతినిధి కాశి రామకృష్ణ ఖండించారు. ఈ ఘటన ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడిగా ఆయన అభివర్ణించారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై దాడులు, బెదిరింపుల ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేయాల్సిన రాజకీయ పార్టీలు భౌతిక దాడులకు పాల్పడటం...