పెనుగుదురు అభ్యర్థి కే ఎంపీపీ పదవి
జనసేన లో 50 మంది తో చేరిన మాజీ వైసీపీ ఎంపీటీసీ బండారు సుజాత వెంకటేశ్వరావు కు ఎమ్మెల్యే పంతం నానాజీ స్వాగతం
కరప (జిఎస్ బి వార్త)
కరప మండలం పెనుగుదురు గ్రామానికి స్థానిక ఎన్నికల్లో ఎంపీపీ పదవి ఇవ్వడం జరుగుతుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. ఆదివారం మాజీ వైసీపీ ఎంపీటీసీ బండారు సుజాత వెంకటేశ్వరావు జనసేన లో చేరారు.
ఈ సందర్బంగా సుమారు 50 మంది వైసీపీ నుండి జనసేన లో చేరినట్టు తెలిపారు.ఎంపీటీసీ అభ్యర్థి బండారు మురళి,నీటి సంఘం అధ్యక్షులు తుమ్మల పల్లి గోవిందరాజులు ,మాజీ ఎంపీపీపెంకే శ్రీలక్ష్మి సత్తిబాబు, మాజీ జడ్పీటీసీ యాళ్ల సుబ్బారావు,గ్రామ నాయకులు సొసైటీ అధ్యక్షులు రెడ్డిపల్లి నారాయణ రావు, మాజీ ఎంపీటీసీ తుమ్మలపల్లి మాచర్రావు, రెడ్డిపల్లి భాస్కర్,బండారు వెంకటేశ్వరావు, బోగిరెడ్డి కొండబాబు, మామిడాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామం లో ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి చూసి అభ్యర్థులు ను గెలిపించాలాన్నారు.