vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 21 October 2026, 7:53 am Posted by : వార్తా జిఎస్‌బి

పెనుగుదురు మాజీ వైసీపీ ఎంపీటీసీ బండారు సుజాత వెంకటేశ్వరావు పార్టీ కి రాజీనామా 

పెనుగుదురు మాజీ వైసీపీ ఎంపీటీసీ బండారు సుజాత వెంకటేశ్వరావు పార్టీ కి రాజీనామా

కరప (జిఎస్ బి వార్త)

స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ పోటీకి

నాయకులు మోకాలడ్డు

కరప (జిఎస్ బి వార్త)

కరప మండలం లో స్థానిక ఎన్నికలు సిచ్చు రేపుతున్నాయి. గత వైసీపీ లో ఎంపీటీసీ గా పనిచేసి ప్రస్తుతం జనరల్ మహిళ కోటలో సర్పంచ్ గా పోటీచేస్తానంటే గ్రామ నాయకులు కూటమి కి మధ్ధత్తు తెలుపుతున్నారని దానికి మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు కూడా వత్తాసు పలుకుతున్నారని దీనికి తాము పార్టీ కి రాజీనామా చేస్తున్నట్టు పెనుగుదురు మాజీ ఎంపీటీసీ బండారు సుజాత, వెంకటేశ్వరావు ప్రకటన లో తెలిపారు.బుధవారం రాజీనామా లేఖ మాజీ మంత్రి కూరసాల కన్నబాబు కు పంపుతున్నట్టు తెలిపారు. స్థానిక వైసీపీ నాయకులు పార్టీ పరువు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో వైసీపీ నాయకులు ద్వంద వైఖరి విడనాడాలని తెలిపారు. ఈ రాజీనామా ఆమోదించాలని కోరారు.