ప్రజల మేలు కోసమే కూటమి ప్రభుత్వం కృషి: ఎమ్మెల్సీ రాజశేఖరం, మాజీ జడ్పీటీసీ నులుకుర్తి

ప్రజల మేలు కోసమే కూటమి ప్రభుత్వం కృషి:మాజీ ఎమ్మెల్యే పిల్లి,ఎమ్మెల్సీ రాజశేఖరం, కాకినాడ రూరల్, ఆగస్టు 04(జిఎస్ బి వార్త): ప్రజల క్షేమం, సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అనునిత్యం కృషి చేస్తోందని పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, మాజీ జడ్పీటీసీ నులుకుర్తి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ పిలుపు మేరకు చేపట్టిన 'ఇంటింటికి తెలుగుదేశం' ప్రచార కార్యక్రమం మంగళవారం కాకినాడ నగరంలోని 42వ డివిజన్‌లో అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి నగర్, చిన స్వామి నగర్, ప్రతాప్...