vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 5:56 pm Posted by : వార్తా జిఎస్‌బి

ప్రజల వద్దకే ప్రభుత్వం.. ప్రతి కుటుంబానికి అభివృద్ధి సందేశం*రామచంద్రపురంలో ఇంటింటి ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వాసంశెట్టి

 

ప్రజల వద్దకే ప్రభుత్వం… ప్రతి కుటుంబానికి అభివృద్ధి సందేశం*రామచంద్రపురంలో ఇంటింటి ప్రచారo లో మంత్రి వాసంశెట్టి సుభాష్*

రామచంద్రపురం:(జిఎస్ బి వార్త)

ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమై కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి చేరవేసే లక్ష్యంతో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం రామచంద్రపురం పట్టణంలోని 18, 19 వార్డుల్లో మంత్రి సుభాష్, కూటమి పార్టీ నాయకులతో కలిసి విస్తృతంగా పర్యటించి ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ప్రభుత్వం గత రెండేళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ నిర్ణయాలను వివరించి ప్రభుత్వం అందిస్తున్న సేవలను ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, ప్రజా ప్రయోజన కార్యక్రమాలను వివరించనున్నట్లు తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ కార్యక్రమాలపై స్పష్టమైన అవగాహన కల్పించడంతో పాటు వారి అభిప్రాయాలు, సూచనలు తెలుసుకొని వాటిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విధంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి సూచనకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా మరింత మెరుగైన పాలన అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఒక ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.ప్రతి గడపకు ప్రభుత్వ అభివృద్ధి ఫలాలను చేర్చడంతో పాటు ప్రజలతో ప్రత్యక్ష అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ ప్రత్యేక కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వం – ప్రజల మధ్య మరింత విశ్వాసాన్ని పెంపొందిస్తూ, ప్రతి కుటుంబానికి అభివృద్ధి, సంక్షేమం చేరేలా ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, నియోజకవర్గ పరిశీలకులు మజ్జి పద్మావతి, పట్టణ టీడీపీ అధ్యక్షులు ఉండవిల్లి శివ, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆయా వార్డుల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.