ప్రతిపక్షాల ధర్నాలు కాలక్షేపానికే: టిడిపి మహిళా నాయకురాలు డా. రాయవరపు సత్యభామ మండిపాటు ​

[caption id="attachment_909" align="alignleft" width="696"] రాష్ట్రంలో ప్రతిపక్షాలు చేపడుతున్న ధర్నాలు, ఆందోళనలు కేవలం కాలక్షేపానికేనని, ఉనికిని కాపాడుకోవడానికే తప్ప ప్రజల కోసం కాదని టిడిపి మహిళా నాయకురాలు డాక్టర్ రాయవరపు సత్యభామ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుల వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేస్తోందని సత్యభామ తెలిపారు. రాజధాని అమరావతిని స్వర్గసీమగా తీర్చిదిద్దడంతో పాటు, ఒకప్పుడు బస్సులు కూడా వెళ్లలేని భోగాపురం వంటి...