vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 07 August 2026, 9:08 am Posted by : వార్తా జిఎస్‌బి

ప్రధాని నరేంద్ర మోదీతో అల్పాహార సమావేశంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు

*టీడీపీ రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్, లింగమనేని రమేశ్ శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు.

నూతనంగా రాజ్యసభ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ప్రధాని మోదీ వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని ప్రధాని సూచించినట్లు ఎంపీలు తెలిపారు. కేంద్ర–రాష్ట్ర సమన్వయంతో రాష్ట్ర అభివృద్ధికి మరింత కృషి చేయాలనే ఉద్దేశంతో ఈ సమావేశం జరిగిందని పేర్కొన్నారు.