ప్రభుత్వ హాస్టళ్లపై ఆంక్షలు పాలనా వైఫల్యానికి నిదర్శనం: — వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి కాశి రామకృష్ణ.

  ముమ్మిడివరం ఆగస్ట్ 13( జియస్ బి వార్త) సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలల్లోకి జర్నలిస్టులు, ప్రజాప్రతినిధులు మరియు హక్కుల నాయకులు వెళ్లకుండా ప్రభుత్వం ఆంక్షలు అత్యంత దారుణమని జిల్లా అధికార ప్రతినిధి కాశి రామకృష్ణ పేర్కొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు కనీస మౌలిక వసతులు కరువయ్యాయని, నాణ్యత లేని ఆహారంతో పాటు సురక్షితమైన మంచినీళ్లు సైతం అందచేయకపోవడం పట్ల విద్యార్థులు తీవ్ర అవాంతరాలు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాఠశాలలో దళిత...