భక్తి–సేవాభావాల దివ్య సంగమం* : *గాజుల అలంకరణలో పిడుగులమ్మ తల్లి శాంభవీ రూపం* *విజయదశమి వేళ మంగళహారతుల నీరాజనం.. నిత్యాన్నదానంతో పునీతమైన భక్తకోటి*

కాకినాడ సిటీ అక్టోబర్ 20 జి ఎస్ బి వార్త భక్తుల ఆర్తిని బాపి, కొలిచిన వారికి కొంగుబంగారమై వరాలనిచ్చే జగజ్జనని, సంజయ్‌నగర్ గ్రామదేవత శ్రీశ్రీశ్రీ పిడుగులమ్మ తల్లి సన్నిధి విజయదశమి మహాపర్వదినాన దివ్య ఆధ్యాత్మిక శోభతో పులకించింది. దసరా నవరాత్రుల ముగింపు వేళ అమ్మవారిని సర్వమంగళప్రదమైన రంగురంగుల గాజులతో నేత్రపర్వంగా అలంకరించి, శాస్త్రోక్తంగా విశేష కుంకుమార్చనలు, దీపారాధనలు నిర్వహించారు. లలితా సహస్రనామ పారాయణాల మధ్య గాజుల అలంకారంలో జగన్మాత మంగళకరంగా దర్శనమివ్వడంతో ఆలయ ప్రాంగణం భక్తిపారవశ్యంతో ప్రతిధ్వనించింది.రాష్ట్ర శెట్టిబలిజ కార్పొరేషన్ డైరెక్టర్ వమ్మి...