భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సకిలే పద్మావతి తరఫున జోరుగా ఎన్నికల ప్రచారం! ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిని గెలిపించాలి – సకిలే వెంకటేశ్వరరావు విజ్ఞప్తి
డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా – ముమ్మిడివరం నియోజకవర్గం: ఐ. పోలవరం మండలంలో జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి సకిలే పద్మావతి తరఫున ఆమె భర్త సకిలే వెంకటేశ్వరరావు భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. వర్షం కురుస్తున్నప్పటికీ వెనుకడుగు వేయకుండా మండలంలోని వివిధ గ్రామాల్లో ఓటర్లను నేరుగా కలుస్తూ, వైఎస్సార్సీపీకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా సకిలే వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఐ. పోలవరం మండల అభివృద్ధి,...