భైరవపాలెం ప్రజల కన్నీటి గోడు.. ఆదుకోండి మహాప్రభో! ఐదు రోజులుగా విద్యుత్ లేక అంధకారంలో గ్రామం.. వేటకు వెళ్లలేక విలవిలలాడుతున్న మత్స్యకారులు ఆర్నబ్ తుఫాన్‌తో ధ్వంసమైన ఇళ్లు.. అందని ఉచిత బియ్యం, నష్టపరిహారం జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలని గ్రామస్తుల వేడుకోలు

ఐ. పోలవరం, అక్టోబర్ 30: వరుస తుఫాన్ల దెబ్బకు తీరప్రాంత గ్రామమైన భైరవపాలెం–తీర్థాలమొండి ప్రజల జీవనం అస్తవ్యస్తంగా మారింది. తుఫాన్ బీభత్సం నుంచి ఇంకా కోలుకోకముందే కనీస మౌలిక సదుపాయాలు కరువవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐదు రోజులుగా విద్యుత్ సరఫరా లేక గ్రామమంతా అంధకారంలో ఉండగా, మరోవైపు ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. తమ కష్టాలను అధికారులు పట్టించుకోవాలని గ్రామ ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్‌కు కన్నీటి విన్నపం చేస్తున్నారు....