మండల సర్వసభ్య సమావేశం నామమాత్రమే..! ప్రజా సమస్యలపై సమగ్ర చర్చ లేకుండానే ముగింపు మూడేళ్లుగా గౌరవ వేతనాలు అందక నల్ల బ్యాడ్జీలతో ఎంపీపీ, ఎంపీటీసీల నిరసన
https://vaarthagsb.in/wp-admin/ ఐ. పోలవరం, ఆగస్టు 30 (జీఎస్‌బీ వార్త రిపోర్టర్ వేణు కాశి): ప్రజల సమస్యలకు పరిష్కార మార్గం చూపాల్సిన మండల సర్వసభ్య సమావేశం ఐ. పోలవరం మండలంలో ఆశించిన స్థాయిలో జరగలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి, ఆయా శాఖల అధికారుల నుంచి సమాధానాలు రాబట్టి పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిన సమావేశం నామమాత్రంగా ముగిసిందని పలువురు సభ్యులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఐ. పోలవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ప్రజాప్రతినిధులు, అధికారులు పూర్తి స్థాయిలో...