మహానేత వైఎస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు

పాతఇంజరంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసిన నాయకులు, కార్యకర్తలు ఐ.పోలవరం, సెప్టెంబర్ 02 (జియస్‌బి వార్త రిపోర్టర్ వేణు కాశి): దివంగత మహానేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి (వైఎస్సార్) 17వ వర్ధంతి సందర్భంగా ఐ.పోలవరం మండలంలోని పాతఇంజరం పంచాయతీ పరిధిలో పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న వైఎస్సార్ విగ్రహానికి నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. వైఎస్సార్ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రజల సంక్షేమం...