vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 29 August 2026, 2:46 am Posted by : వార్తా జిఎస్‌బి

మానవతా విలువలకు రాఖీ బంధం

మానవతా విలువలకు రాఖీ బంధం…

యు కొత్తపల్లి ఆగస్టు 28(జి ఎస్ బి వార్త )

ఒక తోటలో పూసిన పువ్వులం అనురాగం మనదేలే అని ఓ సినిమా కవి అన్నా చెల్లెల అనురాగానికి నిర్వచనం చెప్పాడు అన్నా చెల్లెలు అనురాగానికి అతి ప్రాచీనమైన “రక్షాబంధన్ “నేడు రాఖీగా పిలుచుకునే ఒక పండుగకు ఉత్తరాదిలో ప్రాముఖ్యత ఉంది. పూర్వ యుద్ధానికి వెళ్లే వీరులకు స్త్రీలు ( ఎవరైనా) విజయంతో తిరిగి రావాలని రాఖీ కట్టేవారు అలెగ్జాండర్, పురుషోత్తమునకు యుద్ధం జరిగేటప్పుడు శ్రావణ శుక్రవారం నాడు యుద్ధానికి విశ్రాంతిని ఇస్తారు. అప్పుడు పురుషోత్తం భార్య అలగ్జాండర్ వద్దకు వెళ్లి అన్న నేడు శ్రావణ శుక్రవారం మా దేశ సంప్రదాయం ప్రకారం మీరు మా దేశం వచ్చారు కనుక మీకు జయం కలగాలని మీకు రాఖీ కట్టడానికి వచ్చాను అంగీకరించండి అనడంతో ఆశ్చర్యం పొందిన అలెగ్జాండర్ నేను యుద్ధం చేసేది తన భర్తతో అయినప్పటికీ తమ సాంప్రదాయం ప్రకారం చెల్లిగా నా విజయాన్ని ఆశిస్తోంది ఇటువంటి సాంప్రదాయం సంపద ఉన్న ఈ దేశం మీదా?నేను యుద్ధం ప్రకటించింది అని భావించి వెంటనే యుద్ధం విరమించినట్లు చరిత్రలో ఒక కథనం ఉంది.ఈ రాఖీ పండుగకు ఉత్తరాదిలో స్వీట్లు తినిపించుకుంటారు ఇక్కడ డబ్బులు ఇచ్చి పుచ్చుకుంటారు. మానవతా విలువలకు ప్రతిరూపమైన ఈ రాఖీ పండుగ దేశ సౌభాగ్యానికి తొలి అలంకరణ కావాలని యావత్తు ప్రజానీకం భావిస్తున్నారు.