మార్కాపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారులో ఇరుక్కున్న వ్యక్తి

    Date:

    📰 Generate e-Paper Clip

    మార్కాపురం జిల్లా 

     

    మార్కాపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారులో ఇరుక్కున్న వ్యక్తి

     

    మార్కాపురం మండలం తిప్పాపాలెం – చింతకుంట్ల గ్రామాల మధ్య సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న బొలెరో కారు ప్రమాదానికి గురికావడంతో అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి కారులో ఇరుక్కుపోయాడు.

     

    ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమించి కారులో చిక్కుకున్న వ్యక్తిని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం అతడిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

     

    ప్రమాదానికి గల కారణాలు, గాయపడిన వారి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

    Share post:

    Subscribe

    Popular

    More like this
    Related

    App Icon

    Install VGSB News App

    Add to home screen for faster loading and latest updates.

    error: Content is protected !!