మిత్ర బృందం మూడవ వార్షికోత్సవం: ఘనంగా సేవా కార్యక్రమాలు
కాకినాడ సిటీ ఆగస్టు 10 జి ఎస్ బి వార్త కాకినాడ నగరంలో 'మిత్ర బృందం' మూడవ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ఘనంగా జరిగాయి. గడిచిన మూడేళ్లుగా పేదలు, విద్యార్థులకు అండగా నిలుస్తూ సంస్థ అందిస్తున్న సేవలను పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేటీసీ అధినేత డాక్టర్ ప్రవీణ్ చక్రవర్తి మాట్లాడుతూ.. సమాజంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా మానవ సేవలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా అత్యవసర సమయాల్లో రోగులను ఆదుకునేందుకు రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు....