53 క్యాండిల్స్ వెలిగించి చంద్రబాబు పోరాటాన్ని స్మరించిన టీడీపీ శ్రేణులు
ముమ్మిడివరం, సెప్టెంబర్ 9 (జీఎస్‌బీ వార్త రిపోర్టర్ వేణు కాశి):
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును స్మరించుకుంటూ ముమ్మిడివరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ‘నిజం గెలిచింది’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముమ్మిడివరం టీడీపీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
అదేవిధంగా మురమళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద దాట్ల పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు నాయుడు జైలులో గడిపిన 53 రోజులకు గుర్తుగా 53 క్యాండిల్స్‌ను వెలిగించారు.
ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ.. 2023లో చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతరం చోటుచేసుకున్న పరిణామాలను గుర్తుచేసుకున్నారు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా చివరకు న్యాయం, సత్యం విజయం సాధిస్తాయన్నారు. చంద్రబాబు నాయుడు పోరాట స్ఫూర్తి పార్టీ కార్యకర్తలకు ఆదర్శమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. ‘నిజం గెలిచింది’ కార్యక్రమం సందర్భంగా పార్టీ శ్రేణులు తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు.

