ముమ్మిడివరం నియోజకవర్గంలో ఘనంగా ‘నిజం గెలిచింది’ కార్యక్రమంలో పాల్గొన్న దాట్ల పృథ్వీ రాజ్

53 క్యాండిల్స్ వెలిగించి చంద్రబాబు పోరాటాన్ని స్మరించిన టీడీపీ శ్రేణులు ముమ్మిడివరం, సెప్టెంబర్ 9 (జీఎస్‌బీ వార్త రిపోర్టర్ వేణు కాశి): టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును స్మరించుకుంటూ ముమ్మిడివరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ‘నిజం గెలిచింది’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముమ్మిడివరం టీడీపీ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా మురమళ్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద దాట్ల పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు నాయుడు జైలులో గడిపిన 53...