మురమళ్లలో సతీమణితో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనది.. ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి – ఎమ్మెల్యే దాట్ల పిలుపు

  డా. బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా – ముమ్మిడివరం నియోజకవర్గం: ఐ. పోలవరం మండలం పరిధిలో జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో ముమ్మిడివరం శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు) గురువారం మురమళ్ల గ్రామంలో తన సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న ఓటింగ్ సరళిని పరిశీలించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కుకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ప్రతి ఓటరు తమ ఓటు విలువను గుర్తించి బాధ్యతగా ఓటు వేయాలని ఎమ్మెల్యే కోరారు....