మూడు దశాబ్దాల విద్యా ప్రస్థానానికి ఘన వీడ్కోలు..! వేలాది విద్యార్థుల జీవితాల్లో జ్ఞానజ్యోతులు వెలిగించిన ఆదర్శ గురువు తిప్పా వెంకటేశ్వరరావు ఉద్యోగ విరమణ క్రమశిక్షణకు చిరునామా.. అంకితభావానికి ప్రతిరూపం.. “మిస్టర్ పర్ఫెక్షనిస్ట్”గా ప్రత్యేక గుర్తింపు..!

    కాట్రేనికోన, సెప్టెంబర్ 02:( జియస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి) విద్యారంగాన్ని కేవలం ఉద్యోగంగా కాకుండా జీవిత ధ్యేయంగా భావించి, సుమారు మూడు దశాబ్దాల పాటు వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన ఆదర్శ ఉపాధ్యాయుడు తిప్పా వెంకటేశ్వరరావు ఉద్యోగ విరమణ సందర్భంగా చెయ్యేరు గ్రామంలో ఘనంగా ఆత్మీయ సత్కార సభ నిర్వహించారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, ముమ్మిడివరం నియోజకవర్గం, కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలోని శ్రీమతి పోలిశెట్టి లక్ష్మీపార్వతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో...