మూడు దశాబ్దాల విద్యా సేవలకు ఘన వీడ్కోలు మాస్టర్ ఎం. రాజశేఖర్ సేవలు చిరస్మరణీయం… మంచి వ్యక్తిత్వం కలిగిన ఆదర్శ ఉపాధ్యాయుడు ‘మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్’గా… అందరి మన్ననలు పొందిన మోర్త రాజశేఖర్ ఉద్యోగ విరమణ

ఐ.పోలవరం, ఆగస్టు 31 (జియస్‌బి వార్త – వేణు కాశి): విద్యారంగాన్నే తన జీవిత ధ్యేయంగా భావించి, సుమారు మూడు దశాబ్దాల పాటు వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన ప్రముఖ ఉపాధ్యాయుడు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మోర్త ఎం. రాజశేఖర్ సేవలు చిరస్మరణీయమని పలువురు కొనియాడారు. మంచి వ్యక్తిత్వం, క్రమశిక్షణ, అంకితభావం, పనిలో పరిపూర్ణతకు ప్రతీకగా నిలిచిన రాజశేఖర్‌ను సహచరులు ప్రేమగా **‘మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్’**గా అభివర్ణించారు. అందరితో ఆప్యాయంగా మెలిగే ఆయనను పలువురు ముద్దుగా ‘బోలా...