మెగా డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోంది — టిడిపి మండల అధ్యక్షుడు సాగిరాజు సూరిబాబు రాజు

ఐ. పోలవరం ఆగస్ట్ 12( జియస్ బి వార్త) ఐ.పోలవరం మండల టీడీపీ సమావేశం ఐ.పోలవరం మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి నెల రెండవ బుధవారం నిర్వహించే మండల పార్టీ సమావేశం ఈరోజు మురమళ్లలోని శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి మండలంలోని వివిధ గ్రామాల గ్రామ పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, క్లస్టర్ ఇన్‌చార్జిలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు...