రాజకీయ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పాల్గొనడంపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ డిమాండ్ ముమ్మిడివరం మున్సిపల్ కమిషనర్ పి. రవివర్మను సస్పెండ్ చేయాలని జిల్లా అధికార ప్రతినిధి కాశి రామకృష్ణ డిమాండ్

ముమ్మిడివరం: సెప్టెంబర్ 02 ( జియస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి) బాధ్యతాయుతమైన ప్రభుత్వ అధికారి హోదాలో ఉంటూ నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ పార్టీ నాయకుడిలా వ్యవహరించారని ఆరోపిస్తూ, ముమ్మిడివరం మున్సిపల్ కమిషనర్ పి. రవివర్మపై తక్షణమే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి కాశి రామకృష్ణ డిమాండ్ చేశారు. జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా స్థానిక శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్...