రూ.4.24 లక్షల నిధులు అందజేసిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు
ఐ.పోలవరం: కొమరగిరి రామారావుపేటలో నిర్మాణంలో ఉన్న శ్రీరామ మందిరానికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మంజూరైన రూ.4.24 లక్షల నిధులను ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఆలయ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, గ్రామస్తులకు అందజేశారు.
మురమళ్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆలయ నిర్మాణానికి సంబంధించిన నిధులను కమిటీ సభ్యులకు అందించారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయ నిర్మాణానికి మొదటి విడతగా రూ.2 లక్షలు, రెండో విడతగా రూ.2.24 లక్షలు మంజూరు కాగా, రెండు విడతల్లో కలిపి మొత్తం రూ.4.24 లక్షల ఆర్థిక సహాయం అందింది.
శ్రీరామ మందిర నిర్మాణానికి నిధులు మంజూరు కావడం పట్ల ఆలయ కమిటీ సభ్యులు, కొమరగిరి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. ఆలయ నిర్మాణ పనులకు ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ఆలయ అభివృద్ధికి సహకరించిన శ్రీవాణి ట్రస్ట్‌కు, నిధులు అందజేసిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బుజ్జి కృష్ణరాజు, ఆకుల సత్తిబాబు, పెనుమత్స శరత్ రాజు, రాజేష్, కిషోర్ రాజు, దడాల చంటిబాబు, సూర్యనారాయణ, మద్దాల వెంకటేశ్వరరావు, కంకిపాడు దొరబాబు, మాధవ కృష్ణార్జున తదితరులు పాల్గొన్నారు.
