రామ మందిర నిర్మాణానికి శ్రీవాణి ట్రస్ట్ ఆర్థిక సహాయం
రూ.4.24 లక్షల నిధులు అందజేసిన ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ఐ.పోలవరం: కొమరగిరి రామారావుపేటలో నిర్మాణంలో ఉన్న శ్రీరామ మందిరానికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా మంజూరైన రూ.4.24 లక్షల నిధులను ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు ఆలయ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు, గ్రామస్తులకు అందజేశారు. మురమళ్లలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆలయ నిర్మాణానికి సంబంధించిన నిధులను కమిటీ సభ్యులకు అందించారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఆలయ నిర్మాణానికి మొదటి విడతగా రూ.2 లక్షలు, రెండో విడతగా రూ.2.24...