vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 07 September 2026, 4:08 pm Posted by : వార్తా జిఎస్‌బి

రాష్ట్ర స్థాయి పోలీస్ క్రీడల్లో మోర్త బాలయోగి ప్రతిభ 500 మీటర్ల విభాగంలో స్వర్ణం.. 200 మీటర్లలో కాంస్య పతకం…

 

అమలాపురం ఐ. పోలవరం ( జీఎస్ బి వార్త రిపోర్టర్ వేణు కాశి) సెప్టెంబరు 7: 2026 ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టేట్ మీట్‌ (వాటర్ స్పోర్ట్స్) రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన జిల్లా కలెక్టర్ వ్యక్తిగత భద్రతా అధికారి (పీఎస్‌ఓ) మోర్త బాలయోగిని జిల్లా కలెక్టర్ డా. ఆర్. మహేష్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా అభినందించారు. ఇటీవల జరిగిన వాటర్ స్పోర్ట్స్ పోటీల్లో జిల్లా పోలీస్ శాఖ తరఫున పాల్గొన్న బాలయోగి 500 మీటర్ల విభాగంలో స్వర్ణ పతకం, 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకం సాధించారు.

రెండు విభాగాల్లోనూ పతకాలు సాధించి జిల్లా పోలీస్ శాఖకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు తీసుకురావడం పట్ల బాలయోగిని కలెక్టర్, ఎస్పీ అభినందించారు. క్రీడల్లో ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులో మరిన్ని ఉన్నతస్థాయి పోటీల్లో పాల్గొని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. బాలయోగి ప్రతిభను పలువురు అధికారులు, పోలీస్ సిబ్బంది అభినందించారు.