రూ.1,700 కోట్ల అభివృద్ధి జోరు.. ముమ్మిడివరంపై దాట్ల మార్క్!
నాలుగు మండలాలు.. అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యం CMRF సాధన నుంచి అన్న క్యాంటీన్ల వరకు.. పీజీఆర్‌ఎస్‌తో ప్రజలకు మరింత చేరువ ముమ్మిడివరం, సెప్టెంబర్ 06 (జీఎస్‌బీ వార్త – రిపోర్టర్ వేణు కాశి): మాటలకే పరిమితం కాకుండా అభివృద్ధి పనులు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తూ ముమ్మిడివరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారని స్థానిక వర్గాలు పేర్కొంటున్నాయి. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి సుమారు రూ.1,700 కోట్ల విలువైన...