vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 09 August 2026, 3:18 pm Posted by : వార్తా జిఎస్‌బి

రేపు దివంగత భూపతి రాజు సుదర్శన బాబు జయంతి

ఐ. పోలవరంఆగస్ట్ 09( జియస్ బి వార్త) తేదీ:10-8-2026 అనగా రేపు సోమవారం మన ప్రియతమ నాయకులు దివంగత నేత శ్రీ భూపతిరాజు సుదర్శన్ బాబుగారి 82 వ జయంతి సందర్భంగా మన ఐ.పోలవరం మండలం పాత ఇంజరo పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న సుదర్శన్ బాబుగారి విగ్రహం వద్ద రేపు ఉదయం 9:00 గంటలకు జయంతి వేడుకలు ఘనంగా జరుగుతాయి.ఈ జయంతి కార్యక్రమంలో మన ప్రియతమ నాయకులు మాజీ శాసనసభ్యులు *శ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ *గారు పాల్గొంటారు అలాగే ఈ కార్యక్రమము పూర్తి చేసుకున్న అనంతరం ఉదయం 9:30 గంటలకు వై యస్ ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు శ్రీ వై యస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు చేపట్టిన GEN G WAR ఉద్యమం లో భాగంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చిర్ల జగ్గి రెడ్డి గారి పర్యవేక్షణలో,ముమ్మిడివరం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మరియు కోఆర్డినేటర్ శ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో,డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం తిమ్మాపురం గ్రామంలో దొమ్మేటి పనింద్ర గారి రియల్ ఎస్టేట్ సైట్లు నుండి కాట్రేనికోన MRO కార్యాలయం వరకు బైక్ 🚴‍♂️ ర్యాలీ జరుగును.కావున ఈ కార్యక్రమంలో మన ఐ.పోలవరం మండలం వై యస్ ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు ముందుగా సుదర్శన్ బాబుగారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించి న అనంతరం మన ఐ.పోలవరం మండల 14 పంచాయతీల వై యస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కాట్రేనికోన మండలం లో ఏర్పాటు చేసిన బైక్ 🚴‍♂️ ర్యాలీ లో పాల్గొని విజయవంతం చేయాలని పేరు పేరునా కోరుకుంటున్నాము

ఇట్లు,

పిన్నమరాజు వెంకటపతి రాజు
మండల పార్టీ అధ్యక్షులు(YSRCP)
ఐ.పోలవరం మండలం