vaarthagsb.in
Newspaper Banner
Date of Publish : 22 July 2026, 2:21 am Posted by : వార్తా జిఎస్‌బి

రోడ్లు, డ్రెయిన్ పరిసరాలు శుభ్రంగా ఉండేలా సిబ్బందికి తగిన సూచనలు

కాకినాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కేటీ సుధాకర్ నగరంలోనిపారిశుధ్య పనులను పరిశీలించారు.

​కాకినాడ, (జిఎస్ బి వార్త )

  1. స్మార్ట్ సిటీ నగరంలో ​కాలువల పూడికతీత & శుభ్రత: డ్రైనేజీ కాలువల్లో పేరుకుపోయిన చెత్త, పూడికను పైపులు మరియు యంత్రాల సహాయంతో తొలగించే ప్రక్రియను పరిశీలించారు.​ రోడ్లు, డ్రెయిన్ పరిసరాలు శుభ్రంగా ఉండేలా సిబ్బందికి తగిన సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ కాకినాడ నగరంగా తీర్చిదిద్దేందుకు పారిశుధ్యం మెరుగుపరచడానికి మరియు డ్రైనేజీ వ్యవస్థ సజావుగా సాగేందుకు పలు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.